విశాఖ: జాలర్ల వలకు చిక్కిన అరుదైన జీవి.. ఈ లాబ్‌స్టర్ అంత తోపా.. అంత రేటా?

8 months ago 10
విశాఖ జాలర్ల వలకు అరుదైన లాబ్‌స్టర్లు పడ్డాయి. దీంతో మత్స్యకారులు సంబరపడుతున్నారు. లాబ్‌స్టర్ చూడటానికి రొయ్యను పోలి ఉంటుంది. విదేశాల్లో లాబ్‌స్టర్ మాంసానికి గిరాకీ ఎక్కువ. దీంతో వీటికి భారీ డిమాండ్ ఉంది. ఇక మత్స్యకారుల వలలో రెండు పెద్ద లాబ్‌స్టర్లు పడ్డాయి. ఒక్కోటి కిలో బరువు ఉన్నట్లు జాలర్లు చెప్తున్నారు. వీటిని ఒక్కోదానిని కిలో రూ.2000 చొప్పున విక్రయించారు. మరోవైపు లాబ్‌స్టర్ మాంసంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని.. అందుకే వీటి మాంసానికి డిమాండ్ ఎక్కువని జాలర్లు చెప్తున్నారు.
Read Entire Article