విశాఖ: లోకోపైలట్ అప్రమత్తత.. టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..

3 months ago 8
విశాఖలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పెందుర్తి వద్ద రైల్వే పనుల్లో ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం ఓ పక్కకు ఒరిగింది. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు అటుగా వచ్చింది. ఈ విషయాన్ని దూరం నుంచే గమనించిన లోకో పైలెట్.. అప్రమత్తతతో రైలును నిలిపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article