Visakhapatnam Paragliding Trail Run Success: విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో బోట్ షికార్, స్కూబా డైవింగ్ పర్యాటకులను అలరిస్తున్నాయి. తాజాగా మరింత మధురాభూతిని కలిగించేందుకు లివిన్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్ ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతం అయ్యింది. ఈ మేరకు త్వరలోనే ఈ సాహసవంతమైన పారా గ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. 300–500 మీటర్లు ఎత్తు వెళ్లి సరికొత్త అనుభూతిని పొందొచ్చు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం.