విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. కొంతమంది కావాలనే చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. అందులో భాగంగానే కేంద్రం నుంచి రూ.11 వేల కోట్లు నిధులు తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కేటాయించారని.. ప్రజా ధనం ఉపయోగిస్తున్న నేపథ్యంలో బాధ్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌తో పాటుగా కార్మికులపైనా ఉందన్నారు.