విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఇటీవల స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యాజమాన్యం కార్మికులపై నిందలు వేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.