విశాఖకు గూగుల్ రావటం మంచిదే, కానీ.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఇంట్రస్టింట్ ట్వీట్

8 months ago 18
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కోసం మంగళవారం ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద విశాఖలో వచ్చే ఐదేళ్లలో గూగుల్ లక్షా31 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే లోక్‌‍సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ దీనిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. ఇదో గొప్ప విజయంగా అభివర్ణించిన జయప్రకాష్ నారాయణ.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటుగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా దృష్టి సారించాలని సూచించారు.
Read Entire Article