Visakhapatnam Durg Vande Bharat Halt At Parvatipuram: విశాఖపట్నం నుంచి దుర్గ్ మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా దీనిని ప్రారంభించనున్నారు. ఈ రైలు 20వ తేదీ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు కొనసాగుతాయి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది. అయితే ఈ రైలుకు ఏపీలోని పార్వతీపురంలో కూడా ఆ రైలుకు కొత్తగా స్టాప్ ఇచ్చారు. అంటే ఏపీలోని మూడు స్టేషన్‌లలో ఆగుతుంది.