Visakhapatnam Iran Students Seeking Financial Help: విశాఖపట్నంలో ఇద్దరు ఇరాన్ మహిళలు కష్టాలు పడుతున్నారు. ఫార్మసీ చదవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు యుద్దం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారుల్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పది రోజుల క్రితం వరకు తమ కుటుంబసభ్యులు టచ్‌లో ఉన్నారని.. ఆ తర్వాత నుంచి వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆచూకీ తెలియలేదన్నారు. డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నామని.. తమను ఆదుకోవాలని అధికారుల్ని ఇద్దరు మహిళలు కోరారు.