Visakhapatnam Cognizant Campus Foundation On December 12: విశాఖపట్నంలో ఐటీ రంగం దూసుకుపోతోంది.. ప్రముఖ కంపెనీలు ఎంట్రీకి సిద్దమయ్యాయి. తాజాగా కాగ్నిజెంట్ సంస్థ కాపులుప్పాడలో కొత్త భవనాలకు భూమిపూజ చేయనుంది. అలాగే రుషికొండలో తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈ నెల 12న నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. టీసీఎస్ కూడా కార్యకలాపాలు విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజాల రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారే దిశగా దూసుకుపోతోంది!