Visakhapatnam Double Decker Special Bus Route: విశాఖపట్నం పర్యాటకులకు పండగే. నగర అందాలను చూసేందుకు డబుల్ డెక్కర్, ఓపెన్ టాప్ బస్సులు రానున్నాయి. మూడు బస్సులతో ఏపీ టూరిజం ఈ వినూత్న ప్రయోగం చేయబోతోంది. బీచ్ రోడ్డు, కైలాసగిరి వంటి ప్రదేశాల్లో చక్కర్లు కొట్టే ఈ బస్సులు కొత్త అనుభూతిని పంచనున్నాయి. త్వరలోనే ఈ బస్సులు రానున్నాయి. మరి ఇంకేం ఆలస్యం, విశాఖ అందాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.