విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఒక గిగావాట్ డేటా సెంటర్‌ను విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. అయితే గూగుల్ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ముడసర్లోవ, తర్లువాడ, రాంభిల్లి మండలంలోని భూములను గూగుల్ కోసం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రతినిధులు ఆ ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.