Visakhapatnam Man Loan App Suicide: విశాఖపట్నం మహారాణిపేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకున్నాడు.. వివాహం జరిగి 40 రోజులైంది. దంపతులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నరేంద్ర లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకుని చెల్లించాడు.. అయితే రూ.2వేల విషయంలో వేధింపులు మొదలయ్యాయి. అతడికి, బంధువులు, స్నేహితుల ఫోన్‌లకు మార్ఫింగ్ ఫొటోలు పంపి నరేంద్రతో వెంటనే డబ్బులు కట్టించాలని, లేకుంటే మరిన్ని ఫొటోలు పంపిస్తామని బెదిరించారు. దీంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు.