Visakhapatnam Police Busted Honey Trap Case: విశాఖపట్నంలో హనీట్రాప్ కలకలంరేపింది. అమెరికాలో ఉండే యువకుడ్ని ఓ యువతి మోసం చేసింది.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో రెండు హనీట్రాప్ కేసులు నమోదయ్యాయి అన్నారు సీపీ. డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని వల వేస్తోందని.. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారమే చేయిస్తోందని చెప్పారు. అరెస్టైన నిందితురాలికి ఆ ముఠానే శిక్షణ ఇచ్చి రంగంలోకి దించిందన్నారు. ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.