Visakhapatnam Tourist Integrated Card: విశాఖపట్నంలో పర్యాటకుల కోసం వీఎంఆర్‌డీఏ ఒక కొత్త ప్లాన్ తీసుకొస్తోంది. 'ఇంటిగ్రేటెడ్ కార్డు' పేరుతో రాబోతున్న ఈ కార్డుతో తొమ్మిదికి పైగా పర్యాటక ప్రదేశాలను సులభంగా, తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. రోజువారీ సందర్శకులను, స్థానికులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందిస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ విధానం విశాఖ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.