ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో టీవీఎస్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్.. వేర్ హౌస్ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందుకు గానూ గుర్రంపాలెం ఇండస్ట్రియల్ పార్కులో 17 ఎకరాలు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో 7.33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీవీఎస్ లాజిస్టిక్ వేర్ హౌస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు ఇప్పటికే విజయవాడలో టీవీఎస్ వేర్ హౌస్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.