వెనక్కి తగ్గేది లేదు.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్!

1 hour ago 1
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదరయ్యింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బీసీలకు 34 శాతం కోటాపై ఇచ్చిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు గురువారం కొట్టి వేసింది. అయితే దీనిపై వచ్చే సోమవారంలోపు పిటిషన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ప్రభుత్వం వేసే పిటిషన్‌పై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను నియమించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.
Read Entire Article