ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ, ఈడీ అధికారులు ఆయన్ను విచారించారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిహార్ జైలుకు వస్తున్న కేటీఆర్ అన్నకు స్వాగతం' అంటూ ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశాడంటూ ఓ న్యూస్ పోస్టు వైరల్‌గా మారింది. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.