వైఎస్ జగన్ అప్పుడు చెప్తే ఏమన్నారు.. చంద్రబాబుకు అంబటి కౌంటర్

1 year ago 34
వైసీపీ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే కిందకు దిగజారిందన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలకు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల అమల్లో చేతులెత్తేశారని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని ఎద్దేవా చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదంటూ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హామీలు నెరవేర్చలేనివని.. ఏపీ ఆర్థిక పరిస్థితి అనుకూలించదని అప్పట్లోనే వైఎస్ జగన్ చెప్పారన్న అబంటి రాంబాబు.. అయినా కూడా ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను నమ్మించారని విమర్శించారు. అప్పులు ఉన్నా హామీలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాటమార్చారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
Read Entire Article