Lady Constable Charge Memo After Jagan Selfie: వైఎస్ జగన్ గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో జైల్లో విధులు నిర్వహిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషాబాను జగన్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగారు. జగన్‌కు కరచాలనం చేశారు.. ఈ ఫోటో, వీడియో వైరల్ అయ్యింది. దీంతో కానిస్టేబుల్‌పై జైలు అధికారి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్ విధులు పక్కన పెట్టడంతో ఈ చర్యలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.