Byreddy Siddharth Reddy Ysrcp Youth Wing Post: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీలో కీలక నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక బాధ్యతల్ని అప్పగించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, నియమితులయ్యారు.