Marri Rajasekhar Resign To Mlc Post: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో నేత వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీకి పార్టీకి రాజీనామా చేయగా.. రాజశేఖర్ రాజీనామాతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. రాజీనామా చేసిన వారిలో పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఉన్నారు.