తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్యులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 3.45 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఉత్తర ద్వార నుంచి ఆ దేవ దేవుడిని దర్శించుకుని.. భక్తులు తరిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను అధికారులు రద్దు చేశారు. శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు 4,250 పాసులని మంజూరు చేశారు.