MLC Bharath Posters: చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్నికల ముందు వరకు కుప్పం నియోజకవర్గంలో హల్‌చల్ చేసిన భరత్ ఎన్నికల తర్వాత నుంచి నియోజకవర్గంలో కనిపించడంలేదట.