జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులు రాష్ట్ర ప్రభుత్వాలకు పెను భారంగా మారాయి. కొత్తగా వచ్చిన 'వీబీజీరామ్ జీ' చట్టం వల్ల నిధుల వాటా 60:40 నిష్పత్తికి చేరడంతో.. తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా రూ. 1,789 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. గతంలో కేంద్రమే మెజారిటీ నిధులు ఇచ్చేదని.. ఇప్పుడు రాష్ట్రాల వాటా పెంచడం వల్ల ఇబ్బందులు తప్పవని మంత్రి సీతక్క అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ మార్పుల వల్ల ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా కూలీల ఉపాధికి నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పనిదినాలను 125 రోజులుగా చెబుతున్నా.. మిగిలిన 50 రోజుల ఖర్చును రాష్ట్రాలే భరించాలనడం సరికాదని, పాత పద్ధతినే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.