తెలంగాణవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈసారి రైతులు ముందుగా యంత్ర పరికరాల పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేసిన తర్వాత రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో పొందే విధానాన్ని అమలు చేయనున్నారు. ఈసారి 36 రకాల యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వనున్నారు. అయితే ముందస్తు చెల్లింపు సన్న, చిన్నకారు రైతులకు భారంగా మారవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులు, యూనిట్లు పెంచి యాసంగిలోపు పరికరాలు అందించాలని రైతులు కోరుతున్నారు.