హైదరాబాద్‌లో శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా.. తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు పలు ఆంక్షలు అమలు చేయనున్నారు. జనవరి 30 వరకు సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు చేశారు.