ప్రముఖ సింగర్, రైటర్ గోరటి వెంకన్న గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, కవితలతో జనంలో చైతన్యాన్ని నింపిన వారిలో ఒకరు గోరటి వెంకన్న. అందుకే ఆయన త్యాగాన్ని, పోరాట ప్రతిమను గుర్తించి గత బీఆర్ఎస్ సర్కార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శాసన మండలిలో కూడా బడ్జెట్ చర్చ జరుగుతోంది దీనిపై గోరటి వెంకన్న మాట్లాడారు. అంతకుముందు తన పద్యాలు, కవితలతో.. ప్రభుత్వం పై రెచ్చిపోయారు. ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తనవంతు సూచనలు చేస్తాన్నారు.