ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పులు చేసింది. ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైలులో స్లీపర్ బోగీల సంఖ్యను గణనీయంగా పెంచనుండగా.. సెకండ్ క్లాస్ ఛైర్‌కార్ బోగీలను తగ్గించనున్నారు. జూలై 6 నుంచి సెప్టెంబర్ 1 వరకు తాత్కాలికంగా, సెప్టెంబర్ 2 నుంచి శాశ్వతంగా ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం తిరుపతి వెళ్లే భక్తులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.