చంటి బిడ్డను భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి అనిత ఫోన్ చేసి మాట్లాడారు. విధి నిర్వహణలో లేకపోయినా.. బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దిన రంగంపేటకు చెందిన కానిస్టేబుల్ జయశాంతిని అభినందించారు. ఈ రోజు పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత అన్నారు.