ఏపీలో పేరెంట్ టీచర్ మీటింగ్స్ శనివారం అట్టహాసంగా జరిగాయి. 45 వేలకుపైగా పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి భోంచేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నారా లోకేష్‌ను.. నారా భువనేశ్వరి అభినందించారు.