శుభకార్యాల మాసం వచ్చేసింది. అందరికీ ఇష్టమైన శ్రావణమాసం ఆగస్టు 13 నుంచి ప్రారంభమైంది. ఇక రేపటి నుంచి పెళ్లి బాజాలు, నూతన గృహ ప్రవేశాలు, గుమ్మడి కాయలు కొట్టేయడం అన్నీ మొదలవుతాయి. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసం ఉండనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి పెళ్లిళ్లు కూడా ప్రారంభంకానున్నాయి. దాంతో ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్, డెకరేషన్, భోజనాల తయారీ చేసే వారికి ఇకపై చేతి నిండా పని దొరికినట్టే.