శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది ఈ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కార్తీక ఏకాదశి పర్వదినం, శనివారం రోజు రావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. అయితే ఈ ఘటన జరిగి మూడు నెలలు కూడా గడవకముందే కాశీబుగ్గ ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండగులు రూ.60 లక్షలు విలువ చేసే బంగారం, వెండి నగలు చోరీ చేశారు.