రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం చిరుత పులుల కదలికలు ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చిరుతపులి సంచారం అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించినట్లు స్రీన్ షాట్లు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. దీంతో ఆ ప్రాంత వాసులు భయపడిపోతున్నారు. అలాంటిదే తాజాగా ఓ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులను భయపడుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది పాత వీడియోలను శ్రీకాకుళం వీడియోలుగా వైరల్ చేస్తున్నారు. అలాంటి ఘటన తాజాగా చోటుచేసుకుంది.