Tirumala Ttd 16 Medical Centres 24/7: తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భక్తులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఏకంగా 16 వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. అత్యవసర సమయాల్లో ఈ వైద్య కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది. అంతేకాదు భక్తుల కోసం తిరుమలలో అంబులెన్సు సేవల్ని కూడా అందబాటులోకి తీసుకొచ్చింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ప్రత్యేక వైద్య కేంద్రాలు ఉన్నాయి.