తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల ఆలయం మూసివేయనున్నారు. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకూ సుమారుగా పది గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 3వ తేదీన పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు.