తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆఫ్‌లైన్ పద్ధతిలో శ్రీవాణి టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. జనవరి 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఆఫ్‌లైన్ విధానంలో తిరుమలలో కేటాయిస్తున్న 800 శ్రీవాణి దర్సనం టికెట్లను జనవరి9 నుంచి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో ఏ రోజుకారోజు కేటాయించనుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల చేయనుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోవాలని టీటీడీ సూచించింది.