శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

2 months ago 12
తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రెండు రోజులు రద్దు చేశారు. జులై 14వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. అలాగే ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జులై 17వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా ముందు రోజులలో సిఫార్సు లేఖలు స్వీకరించమని భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించింది.
Read Entire Article