తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి గురువారం సమీక్ష నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకూ తిరుమలలో స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఏఈవో ప్రకటించారు. అలాగే జనవరి 25వ తేదీన ప్రోటోకాల్ దర్శనాలు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.