శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు వినిపించింది. అన్నప్రసాదాన్ని మరింత రుచికరంగా అందించేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా అన్నప్రసాదం మెనూలోకి కొత్త ఐటమ్ చేర్చాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు అన్నప్రసాదం మెనూలోకి మసాలా వడలు చేర్చే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఐదు వేల వడలను శ్రీవారి భక్తులకు వడ్డించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. పరిశీలనలో వచ్చే లోటుపాట్లను సవరించుకుని త్వరలోనే మెనూలో మసాలా వడలు చేర్చనున్నట్లు టీటీడీ తెలిపింది.