Srisailam Temple Shiva Sevaks Chance: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో స్వచ్ఛందంగా సేవలు అందించాలనుకునే శివసేవకుల కోసం దేవస్థానం ఆన్‌లైన్ నమోదు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రలతో పాగుగా దేశవ్యాప్తంగా శ్రీశైలం మల్లన్న భక్తుల వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. శివ సేవకులకు గుర్తింపు కార్డు, స్కార్ఫ్ అందిస్తారు. దర్శన టికెట్లు, వసతి, విరాళాల కోసం కూడా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.