Srisailam Money Seized: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో టోల్‌గేట్ దగ్గర భద్రతా సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇంతలో మహారాష్ట్రకు చెందిన ఓ కారు అటు వైపు రాగా.. లోపల రూ.30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. తాము బంగారు వ్యాపారులమని, దర్శనానికి వచ్చామని కారులోని వ్యక్తులు చెప్పినా, సరైన పత్రాలు చూపించలేకపోయారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు, ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు.