Narasapur Chennai Vande Bharat Train: నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు ప్రారంభంపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సేవలు డిసెంబర్‌లోనే అందుబాటులోకి రానున్నట్లు మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని.. ముందు ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది జనవరి నుంచి కాక.. డిసెంబర్ నుంచే ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి అని ఆయన తెలిపారు. అలానే పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు గురించి ఆయన వివరించారు.