సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.