సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత..

4 months ago 9
తెలంగాణ ప్రభుత్వం ఆధార్ వివరాలను అనుసంధానం చేయని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఉన్న సుమారు 10.14 లక్షల మంది ఉద్యోగులు తమ ఆధార్ మరియు సెల్‌ఫోన్ నంబర్ల వివరాలను ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ లోపు వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని, లేదంటే జీతాలు నిలిచిపోతాయని ఆర్థిక శాఖ హెచ్చరించింది. అయినా కొంతమంది ఆ వివరాలను అప్ లోడ్ చేయకపోవడంతో వారి జీతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Entire Article