సంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ మరియు కూరగాయల సాగు ద్వారా రైతులు ఎక్కువ లాభాలు గడించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం .. పోతారంలో రైతులకు కూరగాయల పెట్టెలు పంపిణీ చేశారు. అక్కన్నపేటలో ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రం, హుస్నాబాద్‌లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో వంద ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని సర్పంచులకు సూచించారు.