శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుక్క విషయంలో గొడవ ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. నల్లమాడ మండలంలో వంకరకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుళ్లాయప్ప అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుతున్నాడు. అయితే కుక్క తమ ఇంట్లోని వారిని కరిచిందంటూ పక్కింటి గోపాల్.. కుళ్లాయప్పను ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కోపంలో కుళ్లాయప్ప, గోపాల్ మీద దాడి చేసి అతని మర్మాంగాన్ని కొరికాడు. ఈ ఘటనలో గాయపడిన గోపాల్‌ను కుటుంబసభ్యులు బెంగళూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కుళ్లాయప్పను అదుపులోకి తీసుకున్నారు.