రేషన్ బియ్యం విక్రయిస్తే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర హెచ్చరికలు చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్కువ వర్షపాతం, నీటి కొరత నేపథ్యంలో రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు, గిరిజనులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.