తెలంగాణలో ప్రస్తుతం అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా.. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెల క్రితం ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడిన క్రమంలోనే.. ఎన్- కన్వెన్షన్ విషయం గురించి ప్రస్తావిస్తూ.. సమంత గురించి రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా చేయటంపై సంచలన కామెంట్లు చేశారు.