గజ్వేల్ అహ్మదీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె.హైమావతి ఉదయం 9:34 గంటలకు కూడా మెడికల్ ఆఫీసర్‌తో సహా పలువురు సిబ్బంది గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు కాని సిబ్బందికి ఒక రోజు జీతం కోత విధించాలని డీఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. ఈ కఠిన చర్యల వల్ల ఉద్యోగుల్లో సమయపాలన, బాధ్యత పెరిగి, ప్రభుత్వ సేవలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.