సరికొత్తగా కాణిపాకం గణేషుడి లడ్డూలు.. ప్రయోగం సక్సెస్..

2 months ago 13
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయిందని ఆలయ పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. ఈ మార్పులతో లడ్డూ రుచి, నాణ్యత పెరిగిందని.. భక్తులుకు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు.
Read Entire Article